కృష్ణా జలాల పంపిణీపై ఉత్కంఠ.. KRMB భేటీ మళ్లీ వాయిదా!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించేందుకు మంగళవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB Meeting) 21వ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ భేటీని నవంబర్ 5వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ అధికారికంగా వెల్లడించారు. ఈ మార్పుకు సంబంధించిన సమగ్ర వివరాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్‌ఎంబీ లేఖలు రాసింది.

అయితే వాస్తవానికి ఈ సమావేశాన్ని తొలుత అక్టోబర్ 1న నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. అనంతరం అక్టోబర్ 26కు వాయిదా వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 27కి వాయిదా వేసిన కేఆర్ఎంబీ .. తాజాగా ఈ బేటీని నవంబర్ 5కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నవంబర్ 5న జరగబోయే సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల పంపిణీ, తాగునీటి కేటాయింపులు, శ్రీశైలం-నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు, ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>