కలం, వెబ్ డెస్క్: స్నేహితుడిని బస్తాండ్‌లో దించి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) లో చోటుచేసుకుంది.
నల్గొండ పట్టణానికి చెందిన ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రముఖ సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అభిలాష్ రెడ్డి తన మిత్రుడిని హయత్ నగర్ బస్టాండ్‌లో దించి, తిరిగి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ అతని బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు అభిలాష్ రెడ్డి తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. మృతుడి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి నల్లగొండ పట్టణంలోని ప్రముఖ ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కొడుకు ఇలా హఠాన్మరణం చెందడంతో తండ్రి, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

