కలం, వెబ్‌డెస్క్: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై (Hyderabad Metro Phase 2) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర మెట్రో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు కారిడార్లు నిర్మించాల్సి ఉంది. 2029 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. తొలుత ఎయిర్‌పోర్ట్ కారిడార్‌తో పనులు ప్రారంభిస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత మెరుగుపడటంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Also Read : ‘బిల్లులు ఇవ్వకుంటే చనిపోతా’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

