epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మారుతి.. ఇది సాధ్యమేనా..?

కలం, వెబ్​డెస్క్​: డైరెక్టర్​ మారుతి (Director Maruthi).. ‘ఈరోజుల్లో’ అంటూ చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించాడు. టాలీవుడ్​లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​తో ‘ది రాజాసాబ్’ మూవీ తీశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్​ రిలీజ్​కి రెడీ అవుతోంది. అయితే.. మారుతికి కామెడీ చిత్రాలు బాగా తీయగలడు అనే పేరుంది. ఇప్పుడు రాజాసాబ్ (Raja Saab) ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో హర్రర్​తో పాటు కామెడీనీ బాగా డీల్ చేశాడనే టాక్ వచ్చింది. ఈ క్రమంలో మారుతి ఓ పాడ్​కాస్ట్​లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకీ.. ఆ డ్రీమ్ ఏంటంటే.. ఐదుగురు స్టార్ హీరోలతో ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని చెప్పాడు.

ఆ ఐదుగురు స్టార్ హీరోలు ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌తో పాటు యూనివర్సల్ హీరో కమల్​హాసన్. ఈ ఐదుగురితో కలిపి పంచతంత్రం లాంటి సినిమా తీయాలని ఉందట. ఇదేదో సరదాగా అనుకోవడం లేదట. దీని కోసం సీరియస్‌గా ప్రయత్నం కూడా చేస్తానని.. పాడ్​కాస్ట్‌లో చెప్పి అందరినీ సర్​ఫ్రైజ్ చేశాడు మారుతి. ఈ సినిమా తీస్తే.. థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా చాలు చెప్పుకోవడానికి అని చెప్పాడు.

అయితే.. ఈ డ్రీమ్​ గురించి వినడానికి బాగానే ఉంది కానీ.. నిజంగా జరుగుతుందా అంటే దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. మన స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటించడమే కష్టం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. ఈ నలుగురూ కలసి నటించడమంటే అసాధ్యమే. ఇప్పటివరకు వీరిలో ఏ ఇద్దరూ కలసి ‘మల్టీ స్టారర్​’లో నటించలేదు. ఇప్పుడు చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో వెంకీ ముఖ్యపాత్ర పోషించాడు. అంతకుమించి ఏ సినిమా రాలేదు. అలాంటిది మన టాప్ స్టార్స్ నలుగురితో పాటు కమల్​హాసన్ కూడా నటించడం అంటే.. జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం అద్భుతమే. మరి.. మారుతి కల నిజం అవుతుందో.. లేక కల గానే మిగిలిపోతుందో చూడాలి.

Director Maruthi
Director Maruthi

Read Also: బన్నీ, లోకేష్‌ కాంబో వెనుక ఏం జరుగుతోంది..?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>