కరీంనగర్ డంపింగ్ యార్డును తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

కలం, కరీంనగర్: నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ (Prapul Desai) మంగళవారం నగరంలోని డంపింగ్ యార్డును సందర్శించారు. పలువురు అధికార సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డులో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించారు. డంపు యార్డులో వస్తున్న చిన్న పాటి మంటలు, పొగను తనికీ చేసి పరిశీలించారు.

అధికారులు, సిబ్బందిని అప్రమత్తంతో స్థానికంగా ఉండి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా నగరపాలక సంస్థ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయంతో మంటలను ఆర్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, డంపింగ్ యార్డులో ఎటువంటి పొగగానీ, మంటలు గానీ రాకుండా పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరపాలక సంస్థ నగర పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించేలా తగిన చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే బయోమైనింగ్ ప్రక్రియ పద్దతిలో చెత్తను తగ్గించేలా చర్యలు తీస్కుంటున్నామని.. బయోమైనింగ్ యంత్రాలను అధికంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>