కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పలువురు సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ (SI Transfers) చేస్తూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతో ఈ బదిలీలు చేపట్టారు. ఖమ్మంలో ఉన్న పి. రఘును ఏడుల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న దామళ్ల విజయకుమారిని చండ్రుగొండ ఎస్హెచ్ఓగా బదిలీ చేశారు. చండ్రుగొండలో పనిచేస్తున్న పిండి శివ రామకృష్ణను భద్రాద్రి కొత్తగూడెం వీఆర్‌కు బదిలీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం వీఆర్‌లో ఉన్న బొగ్గుల సాయి కిషోర్ రెడ్డిని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమించారు. అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న తిప్పాని యయాతి రాజును భద్రాద్రి కొత్తగూడెం వీఆర్‌కు బదిలీ చేశారు. సంబంధిత ఎస్ఐలు ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ అయిన తేదీ, కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీలను వెంటనే తమ కార్యాలయానికి తెలియజేయాలని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ఎస్డీపీఓలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం డీఎస్బీ ఇన్స్పెక్టర్ను ఎస్పీ ఆదేశించారు.

