సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వండి: అభిషేక్

కలం, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. బుధవారం హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ లోపే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) సంచలన సూచన చేశారు. నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌ను 3-1తో ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు. అలా సిరీస్ గెలిస్తే ఐదో టీ20లో 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>