ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్ ఇన్‌చార్జుల నియామకం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనమండలిలో ఖాళీ కానున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) నియోజకవర్గాల ఎన్నికల (MLC Elections) నేపథ్యములో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు, వేగవంతం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అబ్జర్వర్లుగా (ఇన్‌చార్జులుగా) నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీ నిబంధనలు, లక్ష్యాలకు అనుగుణంగా సంబంధిత జిల్లాల్లోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అబ్జర్వర్లను మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని, ఓటర్ల నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>