ప్రశాంత వాతావరణంలో మహిళల నైపుణ్య శిక్షణ తుది పరీక్షలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఫస్ట్ శిక్షణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు అందిస్తున్న వివిధ నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన ఆరవ బ్యాచ్ తుది పరీక్షలు (womens skill training exams ) మంగళవారం విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పరీక్షలను సెట్విన్ అధికారులు, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్‌ఛార్జ్ నిజలింగప్ప తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ., నిరుద్యోగ మహిళల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి సాధించేలా ప్రోత్సహించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడగలరని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఇటువంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ పరీక్షల నిర్వాహకులు హాజీ అలీ, సరిత, అజిమత్ ఉన్నీసా, లత తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>