చెన్నై ట్రాఫిక్ పోలీసులకు CSK భారీ గిఫ్టులు.. కోటి విలువైన 63 బైకులు!

కలం, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) యాజమాన్యం నగర ట్రాఫిక్ పోలీసులకు రూ.కోటి విలువైన 63 బైకులను అందించింది. సామాజిక బాధ్యతలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ఈ వాహనాలను అందించింది. వీటిలో 38 హోండా షైన్, 25 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఉన్నాయి. CSK ఎండీ విశ్వనాథన్, చెన్నై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ ఈ వాహనాలను పోలీసులకు అందజేశారు. చైన్నై పోలీసులకు విలువైన బైకులు అందించడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. సీఎస్‌కే‌లా.. ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజ్ యాజమాన్యాలు సోషల్ సర్వీస్‌లో భాగం కావాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>