కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Mahabubnagar Municipal Corporation) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీటి ఒత్తిడి ద్వారా పంపించేసే జెట్టింగ్ ప్రెజర్ వాహనం సంతోష్ నగర్ కాలనీ వద్ద పాడైపోయి లీకేజ్ అవుతున్న దానిని రిపేర్ చేయకుండా అలాగే వదిలేశారు. మోరీల్లో కోరుకుపోయిన చెత్తను తొలగించిన తర్వాత నీటి ప్రెషర్ కాలువల్లో నీరు సాఫీగా వెళ్లేందుకు జెట్టింగ్ ప్రెజర్ మిషన్ ఎంతో అవసరం .
ఎన్నో ఏళ్లుగా సరైన మరమ్మతులు చేయకుండా అలాగే ఉపయోగిస్తుండడంతో ఎక్కడపడితే అక్కడ చెడిపోయి మురాయిస్తుంది. ఇక, కాలనీలో పెరిగిపోయిన కంప చెట్లను తొలగించేందుకు ఉపయోగించే డోజర్ కూడా మొత్తం మున్సిపల్ కార్పొరేషన్‌కు కేవలం ఒకటే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డోజర్ కూడా ఉన్నప్పటికీ అది రాకపోవడంతో ఏడవ డివిజన్లో కంప చెట్లు పెరిగిపోయి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఏడవ డివిజన్‌కు జేసీబీతో పాటు డోజర్‌ను పంపించాలని, జెట్టింగ్ ప్రెజర్ మిషన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

