ఆంక్షలు దాటి ఆందోళనలు: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్ : రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల నిరసన (CJP Protest) ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, నిరసనకారులు బారికేడ్లు, గేట్లను దాటుకుంటూ రోడ్లపైకి వచ్చారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసనల వేదిక జాబితా నుంచి డీనోటిఫై చేయడమే కాకుండా, అక్కడ ఎలాంటి ధర్నాలు చేయడానికి వీల్లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ సీజేపీ యువ కార్యకర్తలు ఆంక్షలను ధిక్కరించి ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సీజేపీ ప్రముఖ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ నిరసనలు ఆపేది లేదని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. రోడ్లపై బైఠాయించిన కార్యకర్తలను, సీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>