కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని ఓ పబ్‌లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ (IAS Vikas Marmat) హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులతో దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి యత్నించినట్లు అభియోగాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వికాస్ మర్మత్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లోని పబ్‌లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వికాస్ మర్మత్ తనిఖీలను అడ్డుకుంటూ అధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ అనే వ్యక్తులపై బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు (CR No. 150/2026) నమోదైంది. పోలీసులు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.

