కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)కు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలంటూ విజయ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
ఎన్నికల నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తుల లావాదేవీలను ఆయన కావాలనే దాచారని ఆరోపించారు. అంతేకాకుండా కొడైకెనాల్‌లోని వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలపై కూడా పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు, పిటిషన్‌ను కొట్టివేయడానికి నిరాకరించడంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది.

