శ్రీవారి సేవలో ‘విరోష్’ జంట.. ‘రణబాలి’ హిట్ కోసం ప్రత్యేక పూజలు!

కలం, సినిమా : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (విరోష్) (Vijay Rashmika )జంట తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం వేకువజామున వీరు ఇద్దరూ కలిసి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఈ జంట, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

భారీ భద్రత నడుమ ఆలయానికి చేరుకున్న ‘విరోష్’ జంటకి, వేదపండితులు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందజేయగా.. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారు ఎలక్ట్రిక్ బగ్గీలో ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరారు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. పెళ్లి తర్వాత వస్తున్న తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ‘విరోష్’ జంట తిరుమల శ్రీవారిని ప్రత్యేకంగా ప్రార్థించారు.

కాగా, రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, రిలీజ్‌కు ముందు ‘విరోష్’ జంట తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో సంగీత ద్వయం అజయ్ – అతుల్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>