స్థానిక పోరుకు వైసీపీ సన్నద్ధం.. నేడు జగన్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై వైసీపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళిపై క్షేత్రస్థాయికి దిశానిర్దేశం చేసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. విజయావకాశాలు మెండుగా ఉండి, ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన బలమైన అభ్యర్థులను వేగంగా గుర్తించాలని జగన్ పార్టీ కోఆర్డినేటర్లకు సూచించే అవకాశం ఉంది. ఈ మేరకు స్థానిక స్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలు లేకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేలా మాజీ సీఎం జగన్ పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే వ్యూహంపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. గడప గడపకూ పార్టీ ఆలోచనలను తీసుకెళ్లడం, స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ క్యాడర్‌ను క్రియాశీలం చేయడంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>