నేడే విచారణ.. సీఈసీకి సుప్రీం షాక్ ఇస్తుందా?

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) నిర్ణయాలను, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన 10 మందికి పైగా నేతలు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల ఆధారంగా ఓటర్ల తొలగింపు చర్యలు చేపట్టిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ సవరణల నిర్ణయాలను తక్షణమే రద్దు చేయాలని, సీఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, భారత రాజ్యాంగ సూత్రాలకు భంగం కలిగిస్తున్నాయంటూ అత్యున్నత నాయకులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>