భారత్‌, పాక్‌ హాకీ పోరు మిస్ అవుతున్నాం: సూరజ్‌ కర్కేరా

కలం, స్పోర్ట్స్: భారత్‌–పాక్‌ హాకీ పోరు లేకపోవడం అభిమానులకు లోటేనని, అయితే తమ దృష్టి మాత్రం టైటిల్‌ను నిలబెట్టుకోవడంపైనే ఉందని భారత గోల్‌కీపర్‌ సూరజ్‌ కర్కేరా (Suraj Karkera) తెలిపాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఏ జట్టు పాల్గొనాలనే నిర్ణయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదని స్పష్టం చేశాడు. మైదానంలో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి పాకిస్థాన్‌ వైదొలగడంతో ఈసారి భారత్‌–పాక్‌ పోరు జరిగే అవకాశం లేకుండా పోయింది. పాకిస్థాన్‌ స్థానంలో బంగ్లాదేశ్‌ టోర్నీలోకి వచ్చింది.

అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్‌, మొహాలీలో ఈ టోర్నీ జరగనుంది. భారత్‌, మలేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, బంగ్లాదేశ్‌ జట్లు పోటీపడనున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ బరిలోకి దిగుతోంది. ఇటీవల ఆసియా క్రీడల్లోనూ భారత పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ఫైనల్లో మలేషియాను 5-1తో ఓడించింది. ఇప్పుడు అదే జోరును ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ కొనసాగించి, మరోసారి టైటిల్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>