వాసవి సేవాదళం వైస్‌ చైర్మన్‌గా ఆమెడ శ్రీధర్‌ నియామకం

కలం, నిర్మల్‌ : నిర్మల్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆమెడ శ్రీధర్‌ ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళం (Arya Vysya Mahasabha Vasavi Sevadal) వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వాసవి సేవాదళం అధ్యక్షుడు మహంకాళి విజయ్‌కుమార్‌ గుప్తా సోమవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కమల్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు మొటూరి మురళి గుప్తా, మహాసభ కార్యదర్శి పోలా సుధాకర్‌ గుప్తా, రాష్ట్ర పొలిటికల్‌ వైస్‌ చైర్మన్‌ లింగంపల్లి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఈసీ సభ్యుడు పాల్దే మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>