విద్యార్థి ఉన్నత చదువులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేయూత!

కలం, నేరడిగొండ: భీంపూర్ మండల కేంద్రానికి చెందిన వెట్టి పవన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివేందుకు కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ (Anil Jadhav) ను కలిసి తన పరిస్థితిని వివరించాడు.

స్పందించిన ఎమ్మెల్యే ఐటీడీఏ ద్వారా రూ. 50 వేల ఆర్థిక సాయం మంజూరు చేయించి, చెక్కును విద్యార్థికి శుక్రవారం అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు తన తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింబాజి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>