కలం, వెబ్ డెస్క్: ఏఐ కిడ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన కేరళకు చెందిన 17 ఏళ్ల రౌల్ జోన్ అజు (Raul Jon Aju) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో తెగ వైరలవుతోంది. ఎందుకంటే, అతను సెల్ఫీ తీసుకున్నది రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కావడం విశేషం. మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఏఐ కాన్ఫరెన్స్‌కు రౌల్ జోన్ అజు హాజరయ్యాడు. కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించిన అనంతరం తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో పుతిన్‌ను ఆపి.. సెల్ఫీ అడిగాడు.
పుతిన్ సైతం ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ సెల్ఫీ ఇవ్వడం, వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలవుతోంది. సెల్ఫీ ఇచ్చాక పుతిన్‌తో కరచాలనం కూడా చేశాడు. ‘నిజంగా నేను నమ్మలేకపోతున్నా. సరదా కోసం వీడియోలు తీసుకునే నేను.. అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను కలలు కనని ఎన్నో అవకాశాలను జీవితం నాకు ఇచ్చింది. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఎంతో చేయాలి. నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు.
ఎవరీ రౌల్ జోన్ అజు..
సాధారణంగా పిల్లలు ఏదైనా కావాలంటే తండ్రి నుంచి డబ్బులు అడుగుతుంటారు. కానీ, రౌల్ జోన్ అజు మాత్రం తన తండ్రికే నెలకు రూ.2 లక్షల సాలరీ ఇచ్చి కంపెనీలో నియమించుకున్నాడు. కేరళకు చెందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు.. తొమ్మిదో ఏట నుంచే ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం నేర్చుకున్నాడు. 15కి పైగా ఏఐ టూల్స్ సొంతంగా రూపొందించడమే కాకుండా.. సుమారు 5 లక్షల మందికి శిక్షణ కూడా ఇచ్చాడు. ఒక రోబో కూడా తయారు చేశాడు. అందుకే ఇతడిని ముద్దుగా ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే పుతిన్‌తోనే సెల్ఫీ తీసుకుని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

