సీఎం రేవంత్​ రెడ్డికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లేఖ

కలం, నిర్మల్ : చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి మంజూరైన రూ. 50 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy) సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. ఈ మేరకు నిధుల విడుదల కోరుతూ సీఎంకు లేఖ రాశారు. టీయూఎఫ్‌ఐడీసీ కింద మంజూరైన రూ. 50 కోట్ల నిధులకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు పంపాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ 2025 మే 14న జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు మహేశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు.

దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ పూర్తి వివరాలతో కూడిన సవరించిన ప్రతిపాదనలను 2025 జూన్ 16న టీయూఎఫ్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపించారని ఎమ్మెల్యే (Maheshwar Reddy) తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇతర మున్సిపాలిటీలకు కేటాయించిన విధంగానే నిర్మల్ మున్సిపాలిటీకి నగరాభివృద్ధి కింద రూ.15 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అయితే పట్టణ సమగ్ర అభివృద్ధికి కీలకమైన రూ.50 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే ఏలేటి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>