కలం, వెబ్ డెస్క్ : తన చెల్లెలితో స్నేహం చేయవద్దని వారించినందుకు 17 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు కత్తితో పొడిచి దారుణంగా హత్య (Delhi Murder) చేశారు. వాయవ్య ఢిల్లీలోని సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడిని నౌషాద్‌గా గుర్తించారు. నిందితులలో ఒకరికి నౌషాద్ చెల్లెలితో ఉన్న స్నేహం విషయంలో కొద్దిరోజుల క్రితం వీరి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. ఇదే కక్షతో నిందితులు నౌషాద్‌తో గొడవపడి కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే భగవాన్ మహావీర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ హత్య కేసుకు సంబంధించి 21 ఏళ్ల అతికుర్ రెహమాన్‌ను అరెస్టు చేయడంతో పాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, ఘటనలో వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

