కలం, వెబ్ డెస్క్: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. కొద్ది రోజుల పాటు కాస్త తగ్గినట్లు కనిపించిన పసిడి ధరలు, ఇప్పుడు తిరిగి పెరగడంతో సామాన్య కొనుగోలుదారులలో మళ్లీ ఆందోళన మొదలైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు, నవంబర్ 27వ తేదీన బంగారం ధరలు (Gold Rate Today) ఇలా ఉన్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 కు పైగా పెరిగి, రూ. 1,28,500కు చేరింది. అదే విధంగా కేజీ వెండి రూ.5 వేల పైన పెరిగి రూ. 1,56,100గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో మార్పులు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ వంటి కారణాలతో బంగారం ధరలు మరోసారి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఒకరోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతుండటంతో.. అసలు ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో అర్థం కాక కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు.

