కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన హనుమంతు లక్ష్మి (50) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. ఆమె మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏడుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. లక్ష్మి అవయవాలను(Organ Donation) దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.
లక్ష్మి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, రెండు కంటి కార్నియాలను దానం చేశారు. దీంతో మొత్తం ఏడుగురికి ప్రాణదానం చేసినట్లయింది. ఒకవైపు కుటుంబ సభ్యులు తమ ఆత్మీయురాలిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, ఆమె అవయవాల ద్వారా మరికొందరికి జీవితం లభిస్తుందనే గొప్ప ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న భర్త నర్సింహ చూపిన మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

