కలం, ఆదిలాబాద్ : రానున్న వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Adilabad Collector Rajarshi Shah) అన్నారు. సోమవారం పట్టణ శివారులోని లండసాంగి పంప్‌హౌస్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యామ్ ప్రతిపాదిత స్థలాన్నీ మున్సిపల్ చైర్మన్ బండారి అనుషతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పెంపొందించి, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తాగునీటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో వేగవంతంగా పనిచేయాలని ఆయన (Adilabad Collector) ఆదేశించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఇరిగేషన్ ఎస్‌ఈ ప్రభు కల్యాణ్, ఈఈ భీంరావు, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

