కరెంటు కోతలపై బీజేపీ ఆగ్రహం

క‌లం, రామాయం పేట: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట (Chinna shankarampet) మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు నేతృత్వంలో చిన్న శంకరంపేట-మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను రోడ్డుపైనే దహనం చేసి, నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేశ్ మాట్లాడుతూ.. కరెంటు కొలతలతో పూర్తిగా పంట ఎండిపోయి, రైతులు అప్పుల పాలు అవుతున్నారన్నారు.

పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని, దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే తరుణంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని మండిపడ్డారు.

రైతులను ఆదుకునేందుకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకానికి ఇన్సూరెన్స్ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పక్షాన ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తే పంట నష్ట పరిహారం వచ్చేదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>