కలం, ఆదిలాబాద్ : రీసర్వే ప్రక్రియలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సర్వేయర్ లకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) రోవర్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి ప్రభాకర్, జైనథ్ భోరజ్ తహసిల్దార్లు నారాయణ, బాబు సింగ్, ఆయా మండలాల సర్వేయర్లు, కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

