రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : అదనపు కలెక్టర్

కలం, యాదగిరిగుట్ట : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య పరీక్షలు, రోగుల నమోదు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు.

రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్​ రావు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న చికిత్సలు, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.

అనంతరం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా అదనపు కలెక్టర్​ (Bhaskar Rao) తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి, విధులకు హాజరైన సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>