అమ్రాబాద్ సర్పంచి, ఉప సర్పంచి చెక్ పవర్ రద్దు

కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ (Amrabad) గ్రామ సర్పంచి కోటి, ఉప సర్పంచి రాజా రాం గౌడ్ చెక్ పవర్ రద్దు చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు సోమవారం నోటీసులు జారీ చేశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని మాజీ సర్పంచి డుమావత్ శారద అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. బిల్లులు ఇవ్వాలని చెప్పినా ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్పంచి, ఉప సర్పంచి చెక్ పవర్ రద్దు చేసినట్లు తెలిపారు. అమ్రాబాద్ గ్రామ చెక్ పవర్ అధికారం స్థానిక ఎంపీడీవో రమణకు కల్పించినట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>