గాలి కాలుష్యంతో క్యాన్సర్.. లేటెస్ట్ స్టడీలో షాకింగ్ విషయాలు!

కలం, వెబ్ డెస్క్: ఇండియాలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో (Air Pollution) జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పీఎం2.5 సూక్ష్మ ధూళి కణాలు, కాలుష్య కారకాల ప్రభావంపై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ది క్రిస్టీ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన జీర్ణకోశ క్యాన్సర్ల సదస్సులో ఈ అంశం చర్చకు వచ్చింది. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వివిధ వైద్య విభాగాలు, సంస్థలు, దేశాల మధ్య సమన్వయం అవసరమని సర్ గంగా రామ్ ఆసుపత్రి ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా పేర్కొన్నారు.

సర్ గంగా రామ్ ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తమ ఆసుపత్రి ఔట్‌పేషెంట్ విభాగానికి 15 ఏళ్ల వయసున్న వారిలోనూ కొత్తగా జీర్ణకోశ క్యాన్సర్ కేసులు వస్తున్నాయని, ఐదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి అరుదుగా ఉండేదని తెలిపారు. క్యాన్సర్ నివారణను పొగాకు వినియోగం, ఆహారపు అలవాట్లు, ప్రజలు నివసించే పర్యావరణ పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే కాలుష్య కారకాల వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు పెరిగి, పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత, పేగు కణాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. దీర్ఘకాలికంగా పీఎం2.5 కాలుష్యం బారినపడితే జీర్ణకోశ క్యాన్సర్ల మరణాల పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచించాయి. ఢిల్లీ లాంటి పట్టణ ప్రాంతాల్లో యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యం ఒక సంభావ్య కారణమా అనే అంశంపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>