కలం, వెబ్ డెస్క్: ఏపీలోని 175 నియోజకవర్గాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదలయ్యాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. జిల్లాల్లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ఎప్పటి నుంచో తిష్ట వేసిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వినియోగించబోతున్నారు.
ఇటీవల జరిగిన సమీక్షలో నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేను కోరగా.. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల్చుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నిధుల సమస్య లేకుండా చూసే బాధ్యత తనదేనని.. ఒక్క సీటు కూడా ఓడిపోవద్దని పేర్కొన్నారు.

