ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, ఆదిలాబాద్ : ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani Programme) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>