రూమ‌ర్ల‌కు చెక్‌.. లోకేశ్ క‌న‌గ‌రాజ్ ఇంట్రెస్టింగ్​ పోస్ట్‌​

క‌లం, సినిమా: క్రియేటివ్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) త్వ‌ర‌లో త‌న అప్‌క‌మింగ్ మూవీపై బిగ్ అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. దీనికి అల్లు అర్జున్‌ (Allu Arjun)తో దిగిన ఫోటోను జోడించారు. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం రాకా, AA23 అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇందులో అట్లీ దర్శకత్వం వహిస్తున్న రాకా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక‌ AA23 చిత్రాన్ని యాక్షన్ సినిమాలకు ఫేమ‌స్ అయిన డైరెక్ట‌ర్‌ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందించనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌కు ఈ సినిమా కథ నచ్చినంతగా లోకేష్ కనగరాజ్ ఇచ్చిన పూర్తి స్క్రిప్ట్ న‌చ్చ‌లేదని, దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ వార్తలకు చెక్ పెడుతూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా ఈ ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న లేటెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ AA23 సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో రానున్నాయ‌ని క్యాప్ష‌న్ ఇచ‌చారు. ఈ తాజా ప్రకటనతో ఈ సినిమాపై వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడింది. బ‌న్నీ ఫ్యాన్స్ ఈ పోస్టును తెగ వైర‌ల్ చేసేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>