రంజీ ట్రోఫీకి అన్యాయం: గవాస్కర్

కలం స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీకి (Ranji Trophy) అన్యాయం జరుగుతోందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఇండియా ‘ఏ’ మ్యాచ్‌లను దేశవాళీ టోర్నీతో కలిపి నిర్వహించడం వల్ల రంజీ జట్లకు కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌కు ఇలాంటి పరిస్థితి మంచిది కాదని (Sunil Gavaskar) పేర్కొన్నారు.

రంజీ ట్రోఫీ ప్రారంభమైన రోజే ఇండియా ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ మ్యాచ్‌ చివరి రోజు జరిగింది. దీంతో రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ నెల చివర్‌లొ న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు అనధికారిక టెస్టుల కారణంగా ఇండియా ‘ఏ’ ఆటగాళ్లు మరికొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఇండియా ‘ఏ’ మ్యాచ్‌లు అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లను గుర్తించేందుకు ఉపయోగపడతాయని గావస్కర్ తెలిపారు. అయితే, వాటిని రంజీ ట్రోఫీ సమయంలో నిర్వహించకూడదని సూచించారు. బలహీనమైన పోటీ మధ్య బ్యాటర్లు 2,000 పరుగులు, బౌలర్లు 100 వికెట్లు సాధించినా, ఆ రికార్డులతో వారి అసలు సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించారు. రంజీ ట్రోఫీలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవకాశం కల్పించడం వల్ల పోటీ స్థాయి తగ్గిందని కూడా గావస్కర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్లేట్, ఎలైట్ డివిజన్ల మధ్య ప్రమాణాల్లో తేడా ఉందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>