ఏపీలో బతుక‌మ్మ సంబరాలు!

క‌లం, వెబ్‌డెస్క్: తెలంగాణ పూల పండుగ బ‌తుక‌మ్మ (Bathukamma Festival) రాష్ట్రానికి ఎంతో ప్ర‌త్యేకం. రాష్ట్ర మ‌హిళ‌లు దేశ‌విదేశాల్లో ఎక్క‌డున్నా ఈ ప‌ర్వ దినాల్లో బ‌తుక‌మ్మ‌ను పేర్చి, భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో, ఆట‌పాట‌ల‌తో తొమ్మిది రోజుల‌ వేడుక‌ను జ‌రుపుకుంటారు. అయితే తెలంగాణ మ‌హిళ‌లు త‌ప్ప ఇత‌ర రాష్ట్రాల్లోని మ‌హిళ‌లు ఈ వేడుక‌ను జ‌రుపుకోరు అనే భావ‌న ఎప్ప‌టి నుంచో అంద‌రిలో నాటుకుపోయింది. కానీ, మ‌రో రాష్ట్రంలోని మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ సంబ‌రాలు చేసుకుంటున్నారు. అది ఎక్క‌డో కాదు మ‌న ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లోనే కావ‌డం విశేషం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల‌ మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ వేడుక‌ల్ని చేసుకుంటున్నారు.

అయితే ఏపీ బ‌తుక‌మ్మ వేడుక‌లు తెలంగాణ‌ బతుక‌మ్మ వేడుక‌ల‌కు కాస్త భిన్నంగానే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో తిరువూరు తిరువూరు వారి బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మకు కళ్యాణం కూడా చేస్తున్నారు. వేంపల్లి చెట్టు పెట్టి, బతుకమ్మను, గౌరమ్మను చేసి కళ్యాణం చేయ‌డం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తోంది. అలాగే నందిగామ‌, గుంటూరు, ప‌ట్నాడు, జ‌గ్గ‌య్య‌పేట వైపు కూడా చాలా మంది బ‌తుక‌మ్మ వేడుక‌ల్ని జ‌రుపుకుంటున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఈ వేడుక‌ల‌కు తోడ్పాటునందించాల‌ని, ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ కూడా ఈ పండుగ‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాని మ‌హిళ‌లు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>