ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక పోస్టింగ్!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా పరమైన కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు (AP IAS Transfers) ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు కేటాయించగా, ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2010 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలి(IAS Amrapali)కి ఎట్టకేలకు కీలక బాధ్యతలు దక్కాయి.

ఈ మేరకు ఆగస్టు నెల నుండి ఎలాంటి పోస్టింగ్ లేకుండా సాధారణ పరిపాలనా శాఖలో వెయిటింగ్‌లో ఉన్న ఆమ్రపాలిని ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించింది. తెలంగాణలో పనిచేసిన ఆమ్రపాలి(IAS Amrapali), కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తుది కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఏపీకి రావడంపై కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆమె అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించింది.

కాగా, ఈ ఐఏఎస్ బదిలీల్లో ఏపీ భవన్ ఓఎస్‌డీగా సౌరభ్ గౌర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా మురళీధర్ రెడ్డి, యువజన సేవల సంచాలకుడిగా నీలకంఠ రెడ్డి, సామాజిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా తేజ్ భరత్, పౌర సరఫరాల సంస్థ ఎండీగా వర ప్రసాద్‌లను నియమించారు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడిగా కె.శ్రీనివాసులుకు, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఎండీగా శుభమ్ బన్సల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Also Read : 20 కోట్ల ఓట్ల తొల‌గింపే బీజేపీ ల‌క్ష్యం: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>