బొల్లారం చిన్నారి హ‌త్య కేసులో నిందితుడి అరెస్ట్‌

క‌లం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బొల్లారం (Bollaram)లో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసు (Kidnapping and Murder Case) నిందితుల‌ను పోలీసులు సోమ‌వారం అరెస్ట్ చేశారు. విల్లా కమ్యూనిటీలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసిన విక్రమ్ అనే వ్య‌క్తే ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు తేల్చారు. స‌ద‌రు సెక్యూరిటీ గార్డును ప్రవర్తన సరిగా లేదనే కారణంతో వారం రోజుల క్రిత‌మే ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ కక్షతోనే చిన్నారిని కిడ్నాప్ చేసి ఆమె తండ్రి నుంచి రూ.20 లక్షలు వసూలు చేయాలని విక్ర‌మ్ ప్లాన్ వేశాడు. ఈ నేరంలో విక్రమ్‌కు మరో సెక్యూరిటీ గార్డు, స్థానికంగా పని చేసే ఒక ఎలక్ట్రీషియన్ కూడా సహకరించినట్లు తేలింది. మరో సెక్యూరిటీ గార్డు ఫోన్ నుంచి చిన్నారి తండ్రికి కాల్ చేసి నిందితులు డబ్బు డిమాండ్ చేశారు.

పెత్రమాస, బతుకమ్మ వేడుకల సమయంలో కమ్యూనిటీలో జనం ఎక్కువగా ఉండటంతో తాము దొరికిపోతామనే భయంతో నిందితులు చిన్నారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. చిన్నారి అరుపులు బయటకు వినిపించకుండా ఎలక్ట్రీషియన్ బతుకమ్మ పాటల సౌండ్ పెంచగా, మరో సెక్యూరిటీ గార్డు ఎవరూ రాకుండా కాపలా కాశాడు. ఈ క్రమంలోనే విక్రమ్ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి తండ్రికి కాల్ చేసిన నంబర్‌ను సాంకేతికత ఆధారంగా పోలీసులు ట్రేస్ చేశారు. ఆ ఫోన్ మరో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి సహకరించిన సెక్యూరిటీ గార్డుతో పాటు ఎలక్ట్రీషియన్‌ను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>