ప్రతిపక్షాలతో సమావేశానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

​కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల వినతిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ (CJI Surya Kant) తిరస్కరించారు. ప్రతిపక్ష నేతలతో సమావేశానికి సీజేఐ ఒప్పుకోలేదని సుప్రీం కోర్టు వర్గాలు వెల్లడించాయి. రేపు సాయంత్రం 4 గంటలకు జస్టిస్ సూర్యకాంత్‌ను మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు కలవాలని అపాయింట్‌మెంట్ అడిగారు. సర్ ప్రక్రియ, దేశంలో నెలకొన్న పరిస్థితులను సీజేఐకి వివరించాలని భావించారు. సంబంధిత లేఖను అందించగా పరిశీలిస్తామని చెప్పిన సీజేఐ కార్యాలయం.. తాజాగా వినతిని తిరస్కరించింది.

ప్రతిపక్షాలతో సమావేశానికి నిరాకరించడానికి గల నాలుగు ప్రధాన కారణాలను వివరిస్తూ సీజేఐ కార్యాలయం ప్రతిపక్ష నేతలకు ఈ–మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సోమవారం ప్రతిపక్షాలు సుప్రీం కోర్టుకు చేపట్టబోతున్న మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని సమాచారం. ఆయన అనుమతి కావాలని లేఖలో పొందుపర్చకపోవడమే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

సీజేఐ (CJI Surya Kant) ఎందుకు తిరస్కరించారంటే..

1. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశం ఇప్పటికే సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

2. రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు నేరుగా ప్రభుత్వ వ్యవస్థ, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వాలనుకోవడం లేదు. న్యాయ పరంగా సంప్రదిస్తే మాత్రం పరిశీలించి.. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

3. ప్రతిపక్ష నేతలు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లు భావిస్తే.. న్యాయ పరంగా స్వేచ్ఛగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు.

4. మంగళవారం రోజు ప్రతిపక్షాలు చెప్పాలనుకునే అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతుంది. ఒకవేళ నేతలు ఇంకా ఏవైనా పిటిషన్లు వేసినా సుప్రీం కోర్టు వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.

Also Read : బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. విండీస్ చిత్తు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>