క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.10 కోట్లకు పైగా మోసం

కలం, ఆదిలాబాద్: క్రిప్టో కరెన్సీలో (Cryptocurrency Scam) పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఐటీసీ గ్లోబల్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితులు ఉన్నారని, రూ.10 కోట్లకు పైగా మోసం జరిగినట్లు పేర్కొన్నారు. cticlub.org పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ నిర్వహిస్తూ, పోంజీ స్కీమ్‌, మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా పెట్టుబడులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

హోటళ్లలో సమావేశాలు, జూమ్ మీటింగ్‌ల ద్వారా ప్రజలను ఆకర్షించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సంస్థ వ్యవస్థాపకుడు పొలమారశెట్టి రత్నరాజు, సహ వ్యవస్థాపకుడు దొండపాటి లక్ష్మణరావు అలియాస్ లాజరస్‌ను అరెస్ట్ చేశామని, మరో నలుగురిపై కేసు నమోదు చేసి ఆస్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్‌లోనూ పలువురు బాధితులు లక్షల రూపాయలు నష్టపోయినట్లు ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టవద్దని, సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>