ఏనుగొండలో ఆలయ నిర్మాణానికి కొత్త కమిటీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ (Yenugonda) శ్రీ చంద్ర కాలనీలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కొత్త కమిటీ ఏర్పాటైంది. ఏడవ డివిజన్ పరిధిలోని శ్రీ చంద్ర కాలనీ, రామకృష్ణ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, సగర కాలనీ, ద్వారకాపురి కాలనీ, పోచమ్మ కాలనీ, అక్షర వీధి, సాయి మిత్ర వీధి ప్రజల కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు నూతన కమిటీ ఛైర్మన్ కుర్వ శ్రీశైలం తెలిపారు. శ్రీ చంద్ర కాలనీ పార్కులో ఏర్పాటు చేసి నూతన కమిటీకి గౌరవ అధ్యక్షులుగా యూనివర్సల్ స్కూల్ పవన్, సగర కాలనీ సత్తయ్య, నారాయణ సుదర్శన్, అధ్యక్షుడిగా మేకల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా సి.సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా వెంకటేష్, ప్రచార కార్యదర్శిగా గుమ్ముడాల చక్రవర్తి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దసరా, బతుకమ్మ సంబురాలను శ్రీ చంద్ర కాలనీ పార్కులో జరుపుకోవాలని నిర్ణయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>