కలం, నిర్మల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి పూజలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో కొత్త బస్టాండ్, నారాయణ రెడ్డి మార్కెట్, పాత బస్టాండ్ ప్రాంతాలు జనసందోహంతో కిటకిటలాడాయి. అమ్మవారికి సమర్పించే పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన మార్కెట్ ప్రాంతాలు రద్దీగా మారాయి.
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పూజా సామగ్రి కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో వ్యాపార ప్రాంతాల్లో సందడి నెలకొంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ వీధులు జనాలతో కళకళలాడాయి. దీంతో ఆదివారం నిర్మల్ పట్టణంలో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది.

