కలం, మహబూబ్ నగర్ బ్యూరో: త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన పట్టభద్రులు తమ పేర్ల నమోదు కోసం హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంజీవ్ ముదిరాజ్ కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తూరు చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్, ఎన్.పి.వెంకటేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెక్కరి అనితారెడ్డి, కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్ కుమార్, మెగ్యా నాయక్, సీజే పూజిత, గులాం జహీర్, సువర్ణ కిషన్, అనుపాటి అంజనేయులు, సద్దుల శేఖర్ పాల్గొన్నారు.

