ఎంబాపే గెట్ ఔట్.. రియల్ ఫ్యాన్స్ ఆగ్రహం

కలం, స్పోర్ట్స్​: స్టార్ ఫుట్‌బాలర్ ఎంబాపేపై (Mbapp) రియల్ మాడ్రిడ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలు తమ క్లబ్ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కారణం విల్లారియల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి ప్రదర్శనే. విల్లారియల్‌పై రియల్ మాడ్రిడ్ విజయం సాధించినా అభిమానులను ఎంబాపే ఆట తీరు అసహనానికి గురి చేసింది. అందుకే ఏకంగా ‘ఎంబాపే గెట్ ఔట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ హోరాహోరీ పోరులో ఎమ్‌బాపే పూర్తిగా తేలిపోయారు. గేమ్ ఫస్ట్‌హాఫ్‌లో ఆయన కొట్టిన బంతి పోస్ట్‌కు తగిలి వెనక్కి రావడమే తప్ప, మ్యాచ్‌ పొడవునా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అత్యంత కీలకమైన సమయాల్లో జట్టును ఆదుకోవడంలో ఎమ్‌బాపే దారుణంగా విఫలమవుతున్నారని, ఇలాంటి ఆటగాడిని వెంటనే జట్టు నుంచి వెళ్లగొట్టాలని ఫ్యాన్స్ తెగేసి చెప్తున్నారు. ఎంత నిరాశపరిచినా కోచ్ జోస్ మొరైన్ ఎమ్‌బాపేను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించడం లేదని మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో వినీషియస్ జూనియర్ రెడ్ కార్డ్ చూసి బయటకు వెళ్లినప్పటికీ, యాన్ డియోమాండే సాధించిన ఏకైక గోల్‌తో రియల్ మాడ్రిడ్ విజయాన్ని అందుకుంది. ఈ విజయం లా లీగా పట్టికలో జట్టుకు మూడు పాయింట్లు అందించినప్పటికీ, ఎమ్‌బాపే ఆట తీరుపై మొదలైన వివాదం మాత్రం తగ్గడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>