కలం, స్పోర్ట్స్: ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల.. కానీ, షూటింగ్ పరికరాలు కొనడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. అలాంటి సమయంలో అంజలి భగవత్ (Anjali Bhagwat)కు నటుడు నానా పటేకర్ (Nana Patekar) అండగా నిలిచారు. 1990లలో ఆర్థిక ఇబ్బందులతో అంజలి, దీపాలి దేశ్‌పాండే, సుమా షిరూర్ ఒకే రైఫిల్, షూటింగ్ కిట్‌ను పంచుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న నానా పటేకర్ అంజలికి షూటింగ్ కిట్, కొరియా నుంచి తెప్పించిన జాకెట్, ట్రౌజర్లను సమకూర్చారు. సొంత రైఫిల్ పొందడంలోనూ సాయం చేశారు. ఆ తర్వాత అంజలి సిడ్నీ 2000, ఏథెన్స్ 2004, బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్‌గా కూడా నిలిచారు.

