సీజేపీ ఆందోళ‌న‌కు బంగ్లాదేశ్ యూత్ స‌పోర్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: స‌ర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌ (CJP Protest)కు బంగ్లాదేశ్ (Bangladesh) యువ‌త నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. బంగ్లాలో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ సిటిజెన్ పార్టీ యువత సీజేపీకి అండ‌గా నిలుస్తున్నారు. ఢిల్లీలో నిరసనకారులు, జర్నలిస్టుల అణచివేత, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఎన్సీపీ కన్వీనర్ నహిద్ ఇస్లామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంలో భాగంగా భారత్ యువతకు తాము సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న‌ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.

2024 జూలైలో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని గుర్తు చేస్తూ.. సరిహద్దులు దాటి ప్రజాస్వామ్య పోరాటాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఇస్లామ్ పేర్కొన్నారు. షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ వంటి విద్యార్థి నేతల నిర్బంధాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ అసహనాన్ని, మతతత్త్వాన్ని ఇరు దేశాల ప్రజలు తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. ఢిల్లీలో భారీ పోలీసుల మోహరింపు, వేలాది మంది ముందస్తు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో శాంతియుత నిరసనలకు అనుమతించాలని కోరారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. శాంతి భద్రతల పేరిట భావప్రకటన స్వేచ్ఛను హరించడం సరికాదని, దక్షిణాసియాలో పారదర్శకత, సమానత్వం కోసం యువత కలిసి రావాలని కోరింది.

Also Read : స‌ముద్రంలో ప‌డ‌వ బోల్తా.. 109 మంది మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>