గోవా బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గోవాకు బయల్దేరారు. గోవాలో జరుగుతున్న గోయ్ రాఖోన్న్ యాత్ర(Goy Rakhonn Yatra)లో ఈ సాయంత్రం పాల్గొననున్నారు. చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు పాదయాత్రలో పాల్గొని అక్కడి ప్రజలకు అభివాదం చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు.

గోవా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీ(Panaji)లో ప్రారంభమైన గోయ్ రాఖోన్న్ యాత్ర.. 27 రోజుల పాటు 40 నియోజకవర్గాల మీదుగా సాగుతున్న యాత్ర అక్టోబర్ 18న ముగియనుంది. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా యాత్ర సాగుతోంది. గోవా కాంగ్రెస్ విభాగం అధికార బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్ర చేపట్టింది.

Also Read : పోరాటం ఆపబోం.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>