కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ మహాలక్ష్మి అమ్మవారి (Bangalpet Mahalakshmi Temple) ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy), మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.
ప్రతి ఏటా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, లక్కాకుల హరీష్, శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, ఆలయ కమిటీ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read : గోవాకు సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే!
Follow Us On : WhatsApp

