స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతులు.. రైతుల ఆందోళన!

కలం, సారంగాపూర్: సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు (Swarna Project) జౌళి కాలువ గేటు మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లిన ఇరిగేషన్‌ అధికారులను రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో మరమ్మతులు చేపట్టడం వల్ల నీరు వృథాగా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా జౌళి కాలువ గేటు పని చేయకపోవడంతో లీకేజీల ద్వారా నీరు వృథాగా పోతోందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో మరమ్మతులు చేపడితే మిగిలిన నీరు కూడా వృథా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువులకు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన చెందారు. రైతుల అభ్యంతరాలతో అధికారులు మరమ్మతులు చేపట్టకుండానే వెనుదిరిగారు.

Also Read : గోవా బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>