కేరళలో మినీ కూపర్ బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్!

కలం, వెబ్ డెస్క్ : కేరళలోని ఎర్నాకుళం జిల్లా నెడుంబస్సేరి సమీపంలోని అథాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Kerala Accident) జరిగింది. వేగంతో వచ్చిన మినీ కూపర్ కారు, ఒక స్కూటర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు స్కూటర్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యి, బాధితులు రోడ్డుపై పడిపోయారు.

ప్రమాదం అనంతరం వాహనాన్ని నిలపకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన డ్రైవర్ సుహైల్ సజీవ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై స్పందించిన నెడుంబస్సేరి పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి రక్తం నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపించామని, పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

Also Read : ఆదివారం ఆలస్యంగా నిద్రలేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>